Electricity | విద్యుత్ షాక్తో…

Electricity | విద్యుత్ షాక్తో…
Electricity | చేవెళ్ల, ఆంధ్రప్రభ : అడవి పందుల నుంచి మొక్కజొన్న పంటను కాపాడుకునేందుకు వేసిన విద్యుత్ కంచె తగిలి తమ్ముడి కూతురు మృతి చెందింది. ఈ సంఘటన మంగళవారం చేవెళ్ల మండలం మిర్జాగూడ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మిర్జాగూడ గ్రామానికి చెందిన ఇబ్రహీంపల్లి యాదయ్య – అనిత దంపతులకు కుమార్తె వర్షిణి (07), కుమారుడు రుత్విక్ (05) ఇరువురు సంతానం.
పెద్దమ్మ మౌనికతో కలిసి పొలం వద్దకు వెళ్లారు. కాగా ఇద్దరు పిల్లలు ముందుగా పరుగెత్తారు. అడవి పందుల నుంచి మొక్కజొన్న పంటను కాపాడుకునేందుకు పెదనాన్న మల్లేష్ వేసిన విద్యుత్ కంచె వీరికి తగిలింది. విద్యుత్ షాక్ గురైన ఇద్దరు పిల్లలకు విద్యుత్ షాక్ తగిలింది. ఇది గమనించిన పెద్దమ్మ మౌనిక పరిసర ప్రాంత రైతుల సహాయంతో చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఐతే అప్పటికే వర్షిణి (07) మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.

గాయాలైన రుత్విక్ ను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ నగరంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన బాలిక వర్షిణి చేవెళ్ల పట్టణ కేంద్రంలోని నవచైతన్య ప్రైవేట్ స్కూల్లో యూకేజీ చదువుతుంది.
