డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్త చెదారం తొలగింపు

పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పురపాలక సంఘం 15వ వార్డు పరిధిలో డ్రైనేజీల్లోని చెత్తాచెదారం తొలగింపు పారిశుద్ధ్య పనులను నిర్వహించడం జరిగింది. మంగళవారం రోజు పరకాల పురపాలక సంఘం 15వ వార్డు బిజెపి కౌన్సిలర్ కుక్కల విజయ్ కుమార్ పర్యవేక్షణలో కూరగాయల మార్కెట్, ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంతాలలో డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తాచెదారంలో మున్సిపల్ కార్మికుల చే తొలగించడం జరిగింది. అదేవిధంగా చందుపట్ల వీధి, ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంతంలో రోడ్లపై పారిశుధ్యం మున్సిపల్ కార్మికులు తొలగించడం జరిగింది. 15వ వార్డులో కౌన్సిలర్ కుక్కల విజయ్ కుమార్ పర్యవేక్షణలో వార్డు పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా కౌన్సిలర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ వార్డులోని ప్రజలు వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని వెంటనే వాటిని పరిష్కరించడం జరుగుతుందని తెలియజేశారు.

Leave a Reply