రాష్ట్ర స్థాయి సాప్ట్ బాల్ విజేతకు సన్మానం..

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; రాష్ట్ర స్థాయి సాప్ట్ బాల్ టోర్నమెంట్ లో పాల్గొని విజయం సాధించిన నిజామాబాద్ జిల్లా జట్టులో భాగమైన కమ్మర్ పల్లి జడ్ పిహెచ్ఎస్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థినీ బుష్రా ను మరియు ప్రోత్సహించిన వ్యాయామ ఉపాధ్యాయులు నాగభూషణంను ప్రధానోపాధ్యాయులు సాయన్న మంగళవారం శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మునుముందు కూడా క్రీడల్లో ఉత్తమ ప్రతిభా చాటి పాఠశాలకు మంచి పేరును తీసుకురావాలని ఆకాంక్షించారు. కమ్మర్ పల్లి గ్రామ సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్, ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్, వీడిసి అధ్యక్షులు భోగ రామస్వామి, క్యాషియర్ బుచ్చి మల్లయ్య, వీడీసీ సభ్యులు గ్రామ ప్రజలు, యువకులు ఉపాధ్యాయ బృందం విద్యార్థినీ బుష్రాను అభినందించారు.
