రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థి..

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; జిల్లా స్థాయిలో నిర్వహించిన భౌతిక రసాయన శాస్త్రం ప్రతిభా పరీక్షలో ఉత్తమ ప్రతిభను కనబర్చి రాష్ట్ర స్థాయికి ఎంపికైన 9వ తరగతి విద్యార్తి కార్తికేయను జడ్ పిహెచ్ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయన్న మంగళవారం శాలువాతో సత్కరించి అభినందించారు. గైడ్ టీచర్ గా వ్యవహరించిన భౌతిక రసాయనశాస్త్ర ఉపాధ్యాయురాలు సరోజన లక్ష్మి ని ప్రశంసించారు.ఈ నెల 26 వ తేదీన ఎస్ సిఈఆర్ టి హైదరాబాద్ లో జరిగే రాష్ట్ర స్థాయి ప్రతిభ పరీక్షలో పాల్గొంటాడని ప్రధానోపాధ్యాయులు సాయన్న తెలిపారు.
