ఎమ్మెల్యేతో జలమండలి అధికారుల భేటీ

ఎమ్మెల్యేతో జలమండలి అధికారుల భేటీ
హైదరాబాద్, ఆంధ్రప్రభ : యూసుఫ్‌గూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి.నవీన్ యాదవ్ (Jubilee Hills MLA V. Naveen Yadav) ను జలమండలి విభాగ అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా జనరల్ మేనేజర్ సతీష్ కుమార్, యూసఫ్‌గూడ సర్కిల్ DGM రవీంద్రనాథ్ వర్మ, బోరబండ సర్కిల్ DGM సురేష్ కుమార్, బోరబండ వార్డు మేనేజర్ బి.లెనిన్, SPR హిల్స్ సెక్షన్ మేనేజర్ రాజేందర్, ఎల్లారెడ్డిగూడ మేనేజర్ జి.శ్యామ్, తదితరులు హాజరయ్యారు.
నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా చేపట్టిన పనులు ప్రజలకు సకాలంలో అందేలా నాణ్యతతో, గడువులోపే పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ప్రజాసమస్యలపై సమన్వయంతో పనిచేస్తూ మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సూచించారు.
