వాళ్లకి అడ్డంకులు ఉండవు – సుజనా చౌదరి

వాళ్లకి అడ్డంకులు ఉండవు – సుజనా చౌదరి

భవానిపురం, ఆంధ్రప్రభ : విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గంలోని పంజా సెంటర్ లో ఎమ్మెల్యే సుజనా చౌదరి పర్యటించారు. సోమవారం రాత్రి పంజా సెంటర్ లో ఉపవాసాలు చేస్తున్న ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్టుకు వెళ్లారు. ఈ నేపధ్యంలో స్థానిక నేతలు ఎంఎస్ బేగ్, జలీల్ ఖాన్ తదితరులు సుజనా చౌదరిని ముస్లిం సంప్రదాయం ప్రకారం సత్కరించారు. అక్కడ ఏర్పాటు చేసిన హలీం స్టాల్స్ ను సందర్శించారు. అంతే కాకుండా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అధికారుల వల్ల ఇబ్బందులు పడుతున్నామని కొంతమంది హలీం దుకాణ యజమానులు ఎమ్మెల్యేకు విన్నవించారు. నిబంధనల ప్రకారం దుకాణాలు ఏర్పాటు చేసుకున్న వారికి ఎటువంటి అడ్డంకులు ఉండబోవు అని సుజనా చౌదరి దుకాణ యజమానులకు భరోసా ఇచ్చారు. టీడీపీ నాయకుడు సలీం దుకాణంలో కూటమి నాయకులతో కలసి హలీం సేవించారు. అనంతరం అక్కడ ఉన్న స్టాల్స్ ను సందర్శించారు. ఫుడ్ కోర్టుకు వచ్చిన వినియోగదారులతో సైతం ఎమ్మెల్యే సుజనా మాట్లాడారు.

Leave a Reply