చైర్మన్, వైస్ చైర్మన్ కౌన్సిలర్ లను సన్మానించిన నాయకులు…

చైర్మన్, వైస్ చైర్మన్ కౌన్సిలర్ లను సన్మానించిన నాయకులు…
భీమ్గల్ రూరల్,ఆంధ్రప్రభ: ఇటీవల జరిగిన మున్సిపల్ ఎలక్షన్ లో మంచి మెజార్టీతో గెలుపొందిన భీమ్గల్ మున్సిపల్ చైర్ పర్సన్ బోదిరే.నాగమణి (స్వామి) వైస్ చైర్మన్ సంటి లత (నర్సయ్య) కౌన్సిలర్లు ఆరేపల్లి శ్రీజ, (నాగేంద్రబాబు) పర్స కుశలత (అనంతరావు) లను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు భీమ్గల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలపొంది ఎన్నికైన సందర్భంగా భీమ్గల్ మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బద్ది అవినాష్ కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు మర్యాదపురం కలిసి శాలువా పూలమాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బద్ది అవినాష్ మాట్లాడుతూ, గత 15 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా పార్టీ పై నమ్మకంతో సేవలు అందిస్తూ ఉండడంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో మీరు చేసిన సేవలను అధిష్టానం గుర్తించి కౌన్సిలర్ స్థాయి నుండి చైర్మన్ వైస్ చైర్మన్ పదవులు ఇవ్వడంతో చాలా ఆనందంగా ఉందని అధ్యక్షుడు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయ్, శ్రీనివాస్, మహేష్, రాకేష్, ప్రసాద్, రాకేష్,దిలీప్, రాజేష్, అనిల్, తదితరులు పాల్గొన్నారు.
