MLA | యుద్ధమే… సిద్ధంగా ఉండండి…

MLA | యుద్ధమే… సిద్ధంగా ఉండండి…

  • ఇది ట్రైలరే… సినిమా ముందుంది…

MLA | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఇవాళ కారు బోల్తాపడింది… రేపు మీ ప్రభుత్వం బోల్తా పడుతుందని బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లాలో ఇవాళ ఉదయం బీజేపీ ఎమ్మెల్యే వర్సెస్ కాంగ్రెస్ సీనియర్ షబ్బీర్ అలీల మాటల యుద్ధంగా రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే.

దీనిపై ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ… ఈరోజు జరిగింది ట్రైలర్ మాత్రమేనని, సినిమా ముందుందన్నారు. తాను ఎవరినీ రావొద్దంటేనే పరిస్థితి ఇలా ఉందన్నారు. రేపట్నుంచి గ్రామాల్లో తాను తిరుగుతానని, తాను పిలిస్తే వేలాది మంది వచ్చేవారన్నారు. రేపటి నుంచి యుద్ధమే… సిద్ధంగా ఉండండి…అన్నారు. దొంగ ఎవరో.. దొర ఎవరో ప్రజలకు తెలుసన్నారు. కాలేజీ భూముల్లో ఇంచు తేడా వచ్చినా రాజీనామా చేస్తానన్నారు. తనపై ఏం జరిగినా ప్రభుత్వానిది. సీఎందే బాధ్యత అన్నారు.

MLA |

Leave a Reply