బల్క సుమన్ అరెస్టుకు మంచిర్యాల జిల్లా బంద్

మంచిర్యాల, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా భారతీయ రాష్ట్ర సమితి అధ్యక్షుడు చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్ ను ఈనెల 18 బుధవారం అరెస్టు చేయడానికి నిరసిస్తూ బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య,మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజలు ఇచ్చిన ఓటు ద్వారా తీర్పును టిఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుందని దాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీకి చెందిన చెన్నూరు ఎమ్మెల్యే మంత్రి వివేక్ పెద్దపల్లి ఎంపీ వంశీ లు క్యాతన పల్లి మున్సిపాలిటీలో 22 కు గాను సిపిఐ తో కలిసి టిఆర్ఎస్ కౌన్సిలర్లు 14 మంది గెలుపొందగా ఒక అభ్యర్థి ఇండిపెండెంట్గా మరో ఏడుగురు కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచినటువంటి సందర్భంలో మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలను పోలీసులను అడ్డుపెట్టుకొని అడ్డుకుంటున్నటువంటి తరుణంలో బాధితులంగా ఉన్నటువంటి మా కార్యకర్తలకు కౌన్సిలర్లకు ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పోలీసులు తప్పుడు కేసులు బనాయించి మా నాయకుడిని అరెస్టు చేయడానికి వీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని దానికి నిరసనగా గురువారం బందుకు పిలుపునిస్తున్నట్లు ప్రకటించారు.
అధికార పార్టీలో ఉండి రాష్ట్రానికి మంత్రిగా ఉన్న గడ్డం వివేకానంద ఇలాగా ఓడిపోయిన మని జరిగిన బంగపాటును జీర్ణించుకోలేని తండ్రి కొడుకులు మాపై కుట్రపన్ని గుండా యిజాన్ని ప్రదర్శిస్తూ వ్యవహరిస్తున్నప్పటికీ అధికార పార్టీకి కొమ్ము కాస్తూ పోలీసులు వ్యవహరించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీకి మంచిర్యాల జిల్లా ప్రజలు బుద్ధి చెబుతారని గెలుపు ఓటములు ప్రజలే నిర్ణయిస్తారని రాబోయే ఎన్నికల్లో గడ్డం కుటుంబాన్ని ఈ జిల్లా నుండి తరిమికొడతామని హెచ్చరించారు. దీంతో మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా పాఠశాలలకు యజమాన్యాలు సెలవు ప్రకటించరు.మంచిర్యాల పట్టణంలో వ్యాపార సముదాయాలు ఇతర సంస్థలు స్వచ్ఛందంగా బందులో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మంచిర్యాల డిసిపి ఎగ్గడి భాస్కర్ కట్టుదిట్టమైన భద్రత చర్యలను చేపట్టారు.
