పోతరాజు కుంటను పునరుద్ధరణ చేయాలి..

చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల పట్టణంలోని పోతరాజు కుంటను పునరుద్ధరణ చేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి లోడంగి శ్రవణ్ కుమార్ బుధవారం నాడు డిమాండ్ చేశారు. కుంటలో చెత్తను డంపింగ్ చేయడం మూలంగా వర్షాకాలంలో నీరు నిలువ ఉండడం మూలంగా జాతీయ రహదారి గుండా రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. చిట్యాల పట్టణంలో చేపట్టిన జాతీయ రహదారి పనులను వెంటనే పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. హైవే అధికారుల నిర్లక్ష్యం మూలంగా నిత్యం వాహనదారులు పలు ప్రమాదాలకు గురికావడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి ఎండి అక్బర్ ,సహాయ కార్యదర్శి జిల్లా సత్యం, పట్టణ కార్యదర్శి ఎస్కే షరీఫ్, నాయకులు దేశ గాని బాలరాజు ,గుండాల సత్తయ్య , పి. దేవేందర్, ఏళ్ల రవి, కృష్ణ ,మెండ నరసింహ, కన్నెబోయిన సాయిలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply