నెట్ బాల్ క్రీడల్లో రాష్ట్రస్థాయికి ఎంపిక..

కమ్మర్‌ పల్లి, ఆంధ్రప్రభ ; నిజామాబాద్ జిల్లాలోని తిర్న పల్లిలో జరిగిన సీఎం కప్ నెట్ బాల్ క్రీడ టోర్నమెంట్ జిల్లా సెలక్షన్లో, రాష్ట్రస్థాయి నెట్ బాల్ క్రీడా పోటీలకు జడ్పిహెచ్ఎస్ కోన సముందర్ పాఠశాలకు చెందిన డి. నిఖిత,బి.వెన్నెల 9వ తరగతి చెందిన విద్యార్థినిలు బుధవారం ఎంపికయ్యారు.ఈనెల ఫిబ్రవరి 19,20,21,23 తేదిలలో మహబూబ్ నగర్ రాష్ట్రస్థాయి నెట్ బాల్ పోటీలలో పాల్గొంటారని పిడి బి. రమేష్ గౌడ్ తెలిపారు. ఉత్తమ ప్రతిభను ప్రదర్శించి పాఠశాలకు, గ్రామానికి,ఉపాధ్యాయుల అందరికీ మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. మధుపాల్,గ్రామ విడిసి అధ్యక్షులు మెల్ల గంగాధర్, సభ్యులు,గ్రామ సర్పంచ్ బెజ్జారం రాకేష్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు ఉపాధ్యాయుల బృందం విద్యార్థినులను ప్రత్యేకంగా అభినందించారు.

Leave a Reply