ఆందోళన చేపట్టిన విద్యార్థులు..

వెల్దండ, ఆంధ్రప్రభ : వెల్దండ మండల కేంద్రంలోని తెలంగాణ రెసిడెన్షియల్ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థులకు పురుగుల అన్నం పెడుతున్నారని బుధవారం హైదరాబాద్ -శ్రీశైలం జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ నాణ్యమైన ఆహారం అందించకుండా, పురుగుల అన్నం తో విద్యార్థులను అనారోగ్యాలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రిన్సిపాల్ స్వర్ణలత ఏకపక్ష నిర్ణయాలతో విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేసి,విద్యార్థుల ఆరోగ్యాలతో చెలగాటమాడు తున్నారని తెలిపారు. ప్రిన్సిపాల్ ను వెంటనే సస్పెండ్ చేసి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని రోడ్డ పై బైఠాయించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ యంత్రాంగం,ప్రజా ప్రతినిధులు పైఅధికారులకు ఫిర్యాదు చేసి సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేయడంతో ఆందోళన విరమించారు.
