యూరియా కోసం రైతుల తిప్పలు.

వర్ని, ఆంధ్రప్రభ : యూరియా కోసం రైతుల తిప్పలు పడుతున్నారు. యూరియా యాప్ పై రైతులకు అవగాహన లేకపోవడం తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వర్ని మండలం లోని సహకార సంఘాల వద్ద రైతులు బారులు తీరుతున్నారు. యూరియా యాప్ పై వ్యవసాయ శాఖ అధికారుల ప్రచారం రైతులకు చేరలేకపోయింది. స్మార్ట్ ఫోన్ లు ఉన్నప్పటికీ కొందరు రైతులు భయంతో నమోదు చేయించుకోవడం లేదు. ప్రస్తుతం యూరియా కోసం సొసైటీల వద్దకు వచ్చే రైతులకు సిబ్బంది యాప్ లో నమోదు చేయించి యూరియా అందజేస్తున్నారు.

Leave a Reply