బంగ్లా తీరు మారేనా?

పొరుగుదేశంలో కొత్త అధ్యాయం

బంగ్లాదేశ్ ప్రధానిగా బీఎస్పీ నాయకుడు తారీఖ్ రెహమాన్ మంగ ళవారం ప్రమాణం చేయడంతో పొరుగుదేశంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది.మన సహకారంతో కొత్త దేశంగా ఏర్పడిన బంగ్లాదేశ్ మొదట మనకు మిత్రదేశమే. అయితే చైనా, పాకిస్తాన్ల చెప్పుడు మాటలు విని, మనకు శత్రువుగా తయారైంది.

బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు ముజి బూర్ రెహమాన్ కుమార్తె షేక్ హసీనా హయాంలో మనకు సత్సంబం ధాలు ఉండేవి. బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు ఖలీదా బేగం ప్రధానిగా ఉన్నప్పుడు ఆమె తన అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం జమాత్-ఎ-ఇస్లామీ అనే మతతత్వ పార్టీతో చెలిమిచేసిమన దేశంతో వైరాన్ని పెంచుకుంది.

ఇప్పుడు ప్రధానిగా ప్రమాణం చేసిన తారీఖ్ ఆమె కుమారుడే. ఆయన దేశరాజకీయాలతో సంబంధం లేకుండా 17 సంవత్స రాల పాటు లండన్లో ఉండి స్వదేశానికి వచ్చారు. అంతర్జాతీయంగా మా రిన పరిస్థితుల గురించి ఆయన అవగాహన పెంచుకున్నారు. దాంతో ఆయన భారత్తో చెలిమిగా ఉండేందుకే నిర్ణయించుకున్నట్టు ఇటీవల ప్రకటించారు.ఆయన అదే మాట మీద నిలబడితే, మనతో సఖ్యతగానే వ్యవహరిస్తారు. అయితే, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా ఇంతవరకూ వ్యవహరించిన మెగసెసే అవార్డు గ్రహీత మహ్మద్ యూనస్ చైనా, పాక్ల ప్రభావానికి లోనై భారత్లో వైరంగా ఉండటం మొదలు పెట్టారు. మన దేశంలో అంతర్భాగమైన ఈశాన్య భాగాలను ప్రత్యేక ప్రాంతాలనే భావం వచ్చేట్టుగా వ్యాఖ్యలు చేశారు.

సెవెన్ సిస్టర్స్గా అభివర్ణితమైన ఈ రాష్ట్రా లకు తీర ప్రాంతాలతో ఎటువంటి సంబంధం లేదనీ, ఈప్రాంతా లకు తామే సంరక్షకులమనీ, బంగ్లాదేశ్ ద్వారానే ఈ ప్రాంతాల వారుసము ద్రయానం చేయాలని వ్యాఖ్యానించారు. దీనిపై మన దేశం అభ్యంతరం చెప్పింది. ఆయన గత ఏడాది సరిగ్గా ఇదే నెలలో చైనాలో పర్యటించిన ప్పుడు కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ప్రధానమంత్రిగా ప్రమా ణం చేసిన తారీఖ్ యూనస్ ప్రభావానికి లోనవుతారా? అలా కాక, స్వతంత్రంగా వ్యవహరిస్తారా అనే దానిపై బంగ్లాతో మన సంబంధాలు

మిగతా వార్త చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply