Birthday | ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

Birthday | ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ
పేదల పక్షపాతి, రైతు బాంధవుడు కేసీఆర్
రానున్న ఎన్నికల్లో మళ్ళీ కేసీఆర్ యే ముఖ్యమంత్రి
మునుగోడు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి
Birthday | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, రైతు బాంధవుడు, పేదల పక్షపాతి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను చౌటుప్పల్ పట్టణంలో బీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి స్థానిక పార్టీ నేతలతో కలిసి భారీ కేకును కట్ చేశారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు.
సాగు, త్రాగునీటి సమస్యల శాశ్వత పరిష్కారం కోసం అనేక ప్రాజెక్టులను నిర్మించిన అపర భగీరథుడు కేసీఆర్ అన్నారు. ఈ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్లోరిన్ సమస్య శాశ్విత పరిష్కారం కోసం మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి కృష్ణ నీటిని అందించడం జరిగిందన్నారు. రైతాంగానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తును అందించడం, రైతుబంధు ప్రతి రైతుకు సకాలంలో అందించడం, అర్హులైన పేదలందరికీ పింఛన్లు, పేరేంటి ఆడబిడ్డల వివాహాలకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద లక్ష రూపాయల ఆర్థిక సహకారం, కెసిఆర్ కిట్ పంపిణీ తదితర అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేసి దేశంలోనే గొప్ప నాయకుడిగా కేసీఆర్ గుర్తింపు పొందాడన్నారు. రానున్న రోజుల్లో మళ్లీ కెసిఆర్ యే ముఖ్యమంత్రి కావడం ఖాయమని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమాలలో సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు గిర్కటి నిరంజన్ గౌడ్, పార్టీ మున్సిపల్ కన్వీనర్ బొమ్మిరెడ్డి వెంకట్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు సుర్వి మల్లేష్ గౌడ్, సర్పంచ్ అన్యాలపు నరేష్, కౌన్సిలర్లు కొయ్యడ శేఖర్ గౌడ్, ఊదరి యాదయ్య, మాజీ జెడ్పిటిసి పెద్దిటి బుచ్చిరెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, మాజీ గ్రంథాలయం చైర్మన్ ఊడుగు మల్లేశం గౌడ్, రైతుబంధు మండల మాజీ అధ్యక్షుడు కొత్త పర్వతాలు యాదవ్, రైతుబంధు మాజీ జిల్లా డైరెక్టర్ ముప్పిడి శ్రీనివాస్ గౌడ్, నాయకులు జె జె రెడ్డి, కాకి సుందరయ్య, గుండెబోయిన ఇస్తారి, సామిరెడ్డి జనార్దన్ రెడ్డి, రాజారత్నం, కానుగు బాలరాజు, ఎం దయాకరాచారి, పన్నాల ప్రతాపరెడ్డి తదితరులతోపాటు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
