Collector | ఆర్గాన్ మిర్చి ఆరోగ్యానికి మంచిది…

Collector | ఆర్గాన్ మిర్చి ఆరోగ్యానికి మంచిది…
Collector | బూర్గంపాడు,ఆంధ్రప్రభ: ఆరోగ్యానికి ఆర్గాన్ పద్ధతి ద్వారా పండించిన మిర్చి మంచిదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. బూర్గంపాడు మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన యారం లక్ష్మిరెడ్డి అనే ఉత్తమ రైతు 341 రకం కలిగిన మిర్చిని కలెక్టర్ జితేష్ పాటిల్ కు అందించారు.గత మూడు సంవత్సరాల నుండి 341 రకం కలిగిన మిర్చిని పండిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని నేటి ఆధునిక వ్యవసాయంలో ఆర్గాన్ వ్యవసాయం చేసే పంటల ద్వారా ఆరోగ్యవంతమైన జీవనం గడపడానికి ఎంతో దోహదపడతాయన్నారు.
ఫెర్టిలైజర్ విపరీతంగా పంటలపై వాడుతున్న కాలంలో గొప్ప ఆలోచన విధానాన్ని అవలంబిస్తూ ఆర్గాన్ పద్ధతి ద్వారా మిర్చిని పండించడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు. యారం లక్ష్మిరెడ్డి పండించిన మిర్చి తోటను త్వరలోనే స్వయంగా వచ్చి పరిశీలిస్తానని తద్వారా ప్రతి ఒక్క రైతు కూడా ఈ పద్ధతిని అవలంబించేలా మార్గదర్శకాలు అందిస్తానని తెలిపారు. ఆయన వెంట లక్ష్మీపురం మాజీ ఉప సర్పంచ్ పోతిరెడ్డి వెంకటేష్ రెడ్డి, శీను తదితరులు ఉన్నారు.
