ముఖ్యమంత్రిని కలిగిన మంత్రి వాకిటి శ్రీహరి

ముఖ్యమంత్రిని కలిగిన మంత్రి వాకిటి శ్రీహరి
మక్తల్, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనం విజయం సాధించిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎ. రేవంత్ రెడ్డిని మక్తల్ ఎమ్మెల్యే రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి కలిసి డాక్టర్ వాకిటి శ్రీహరి కలిశారు. మక్తల్ నియోజకవర్గంలోని మూడు మునిసిపాలిటీలలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే కాకుండా తను ఇన్చార్జిగా ఉన్న నాగర్ కర్నూల్ జిల్లాలో 17 మున్సిపాలిటీలకు గాను 14 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు సాధించినట్లు మంత్రి శ్రీహరి ముఖ్యమంత్రి కి వివరించారు.
ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని వివరించారు. ఈ ఫలితాల పట్ల ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేసినట్లు చెప్పారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మంత్రి వాకిటి శ్రీహరి తోపాటు ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, కూచుకుళ్ళ రాజేష్‌రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివాసేనరెడ్డి ఉన్నారు.
