Officers |మున్సిపల్ ఛైర్ పర్సన్ ఎవరంటే….

Officers | మున్సిపల్ ఛైర్ పర్సన్ ఎవరంటే….
Officers | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : లక్కీడ్రా ద్వారా ఆ పార్టీని విజయం వరించింది. జనగామ మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. జనగామ మున్సిపాలిటీ ఛైర్మెన్ ఎన్నికలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఛైర్మన్ కోసం నిర్వహించిన ఎన్నికల్లో ఓట్లు సమానంగా పోలవడంతో విజేతను ఎంపిక చేసేందుకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి.
దీంతో అధికారులు లాటరీ పద్ధతి ద్వారా విజేతను ప్రకటించారు. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థి బాలమణి విజేతగా నిలిచారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలోనూ ఓట్లు సమానంగా రావడంతో లాటరీ నిర్వహించారు. ఇక్కడ సైతం కాంగ్రెస్ అభ్యర్థే మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.
