marriage| గ‌ల్లీల్లో పెళ్లి సంద‌డి

marriage| గ‌ల్లీల్లో పెళ్లి సంద‌డి

  • ముంచుకొస్తున్న‌ ముహూర్తాలు
  • 19వ తేదీ నుంచి పెళ్లి ముహూర్తాలు ప్రారంభం
  • గృహప్రవేశాలు, నిశ్చితార్థాలకు మంచి రోజులు
  • శూన్య‌మాసాలు ఆగస్టు నుంచి అక్టోబరు వ‌ర‌కు
  • అప్పుడు శుభ‌కార్యాల‌కు బ్రేక్‌
  • మ‌ళ్లీ న‌వంబ‌ర్‌, డిసెంబ‌ర్‌లో స్టార్ట్‌

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఏ కుటుంబాల్లోనైనా పెళ్లి అంటే అదొక అతిపెద్ద పండుగ. వివాహం జ‌రిగే ఇళ్ల‌లో ఉండే హడావిడే వేరు. పెళ్లికి కొన్ని రోజుల ముందు నుంచే ఏర్పాట్లు చేసుకుంటుంటారు. ఈ నెల నుంచి శుభకార్యాలకు మంచి ముహూర్తాలున్నాయి. పెళ్లిళ్లు పెద్ద సంఖ్యలో జరగనున్నాయి. ఇన్నాళ్లు శుభ ముహూర్తాల కోసం చూసిన వారు ఈ నెల నుంచి ప్రారంభమయ్యే పెళ్లిళ్ల సీజన్ కోసం ముందుగానే ముహూర్తాలను నిర్ణయించుకున్నారు. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు ఈ నెల నుంచి డిసెంబరు వరకూ కొనసాగనున్నాయని పండితులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి మొదలుకానుంది. ఈ నెల 17తో శుక్ర మౌఢ్యమి ముగియడంతో 19వ తేదీ నుంచి పెళ్లి ముహూర్తాలు ప్రారంభం కానున్నాయని పండితులు చెబుతున్నారు. ప్రస్తుతం చాలామంది ఇప్పటి నుంచే 2026కి సంబంధించిన ప్లానింగ్స్‌లో బిజీ అయిపోయారు.

మాఘమాసం శుభ ముహూర్తాలతో సందడి వాతావరణం నెలకొంటుంది. ఈ మాసం శుభప్రదమైనది కావడంతో ఎక్కువగా శుభకార్యాలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. ఈ నేపథ్యంలో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, నిశ్చితార్థాలు ఇలా అన్నింటికీ మంచి రోజులు ప్రారంభం కానున్నాయి. రాబోయే 6 నెలల పాటు ముహూర్తాలు ఉండటం విశేషం. మరోవైపు చాతుర్మాసం, శూన్యమాసం వల్ల ఆగస్టు నుంచి అక్టోబరు వరకు శుభ ముహూర్తాలు లేవు. దీంతో మరో 3 నెలలు శుభకార్యాలకు బ్రేకులు పడనున్నాయి. మళ్లీ ముహూర్తాల కోసం నవంబరు, డిసెంబరు నెలల వరకు వచ్చి చూడాల్సిందే.

ఈ నెల‌ల్లో మంచి ముహూర్తాలు ఇవే
ఫిబ్రవరి: 19, 20, 21, 24, 25, 26
మార్చి: 1, 3, 4, 7, 8, 9, 11, 12
ఏప్రిల్: 15, 20, 21, 25, 26, 27, 28, 29
మే: 1, 3, 5, 6, 7, 8, 13, 14
జూన్: 21, 22, 23, 24, 25, 26, 27, 29
జులై: 1, 6, 7, 11
నవంబర్: 21, 24, 25, 26
డిసెంబర్: 2, 3, 4, 5, 6, 11, 12

Leave a Reply