6 hours | మహాశివరాత్రికి ఘనంగా ఏర్పాట్లు

6 hours | మహాశివరాత్రికి ఘనంగా ఏర్పాట్లు

6 hours | అచ్చంపేట, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూలు జిల్లా, రంగాపూర్ గ్రామం, ప్రముఖ శైవ క్షేత్రం, శ్రీశైల ఉత్తర ద్వారంగా ఖ్యాతిగాంచిన ఉమామహేశ్వర క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పాలకమండలి సభ్యులు, అర్చకుల సహకారంతో భక్తులకు అన్ని వసతులు పూర్తి చేసినట్లు ఆలయ చైర్మన్ బీరం మాధవరెడ్డి, కార్యనిర్వాహక అధికారి శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

మహాశివరాత్రి రోజున ఆదివారం ఉదయం 6 గంటల నుంచి భక్తులు అభిషేకాలు నిర్వహించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడంతో పాటు శీఘ్ర దర్శనానికి ప్రత్యేక వసతులు, టికెట్ కల్పించామని తెలిపారు. ఉదయం నుంచి గవ్యాంతర పూజలతో పాటు భక్తులకు తీర్థ ప్రసాదాల పంపిణీకి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.

6 hours |

ఆదివారం సాయంత్రం 6 గంటలకు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారిచే ఉమామహేశ్వర క్షేత్రంలో హైదరాబాద్ ఎల్బీనగర్ బృందం వారిచే శంభో శివశంకర కూచిపూడి నృత్య ప్రదర్శన, రాత్రి 8 గంటలకు కోలాటం, 9 గంటలకు సత్యహరిచంద్ర నాటక ప్రదర్శన, 10 గంటలకు ఉమామహేశ్వర భజన మండలి సభ్యులచే భజన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. రాత్రి 12 గంటలకు లింగోద్భవము, అనంతరం పాపనాశనం నుంచి స్వామివార్ల పల్లకి సేవ, కొండపైనే స్వామివారి కల్యాణోత్సవం ఘనంగా జరుగుతుందని వెల్లడించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మహాశివరాత్రి పర్వదిన వేడుకలను విజయవంతం చేయాలని వారు కోరారు.

భక్తులకు విస్తృత సౌకర్యాలు..

ఉమామహేశ్వర క్షేత్రానికి వచ్చే భక్తుల కోసం తాగునీరు, సౌచాలయాలు, నీడనిచ్చే టెంట్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. భక్తుల భద్రత, సౌకర్యాల దృష్ట్యా కొండపైకి ఎలాంటి వాహనాలను అనుమతించబోమని, దేవస్థానం బస్సులలోనే కొండపైకి రావాల్సి ఉంటుందని తెలిపారు. భక్తులు సహకరించాలని వారు కోరారు.

Leave a Reply