రేపటి నుండి శ్రీ అంగడీశ్వర ఆలయం వార్షికోత్సవం

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని ఎలగడప గ్రామ సమీపంలో గల శ్రీ అంగడీశ్వర శివ దేవాలయం గురుస్తాన్ మఠం ఆలయం శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం 18వ వార్షిక బ్రహ్మోత్సవాల వేడుకలు మహాశివరాత్రి ఈనెల 15 నుండి 16వ తేదీ వరకు రెండు రోజులపాటు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు ఇప్ప మల్లయ్య ఆలయ కమిటీ చైర్మన్ ఏపూరి రాజ్ కుమార్ గౌడ్ ఉపాధ్యక్షులు ఎదులపురం రాజశేఖర్ కోశాధికారి రాపర్తి నరసయ్య ప్రధాన కార్యదర్శి ఒంటికారి నడిపి రాజన్న ఆలయ కమిటీ సభ్యులు ఎలగడప మాసాయిపేట్ పెత్తరపు కొత్త మద్దిపడగ పాత మద్దిపడగ తదితర గ్రామాల ఉత్సవ కమిటీ సభ్యులు ధర్మకర్తల మండలి సభ్యులు తెలిపారు.

ఈనెల 15న ఆదివారం ఆలయ అర్చకులు చరణ్ పంతులు బృందం ఆధ్వర్యంలో మధ్యాహ్నం శివపార్వతుల కళ్యాణం రాత్రి 12 గంటలకు బిలువ పదార్చన హారతి కార్యక్రమం ఉంటుందన్నారు. 16న సోమవారం మధ్యాహ్నం 12:30 అన్న ప్రసాదం కార్యక్రమం జాతర ఉంటుందని వారు తెలిపారు పై కార్యక్రమాల్లో భగవంతుని బంధువులు భక్తులు గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి వారి కృప పాత్రులు కావాలని వారు కోరారు పై ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం అన్ని చేసినట్లు వారు పేర్కొన్నారు.

Leave a Reply