BJP | ఉత్తమ డివిజన్ గా తీర్చిదిద్దుతా..

BJP | ఉత్తమ డివిజన్ గా తీర్చిదిద్దుతా..

27వ డివిజన్ బిజెపి అభ్యర్థి కల్పే అర్చన చిరంజీవి..
ప్రత్యర్థి పై సుమారు 15వందల పై చిలుక తేడాతో ఘన విజయం..

BJP నిజామాబాద్, ఆంధ్రప్రభ : నగరంలోని అన్ని డివిజన్లో కంటే 27వ డివిజన్ ని ఉత్తమ డివిజన్ గా తీర్చిదిద్దుతానని 27వ డివిజన్ బిజెపి అభ్యర్థి కల్పే అర్చన చిరంజీవి అన్నారు. 27వ డివిజన్ బిజెపి అభ్యర్థి కల్పే అర్చన చిరంజీవి ప్రత్యర్థి పై సుమారు 15 వందల పై చిలుక తేడాతో ఘన విజయం సాధించారు.

ఈ సందర్భంగా అర్చన చిరంజీవి మాట్లాడుతూ.. డివిజన్లో భారతీయ జనతా పార్టీకి ప్రజలు సంపూర్ణ మద్దతు ఇచ్చారని ఈ సందర్భంగా తెలిపారు. నా పై నమ్మకం ఉంచి ఈ విజయాన్ని అందించిన డివిజన్ ప్రజలకు రుణపడి ఉంటానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. డివిజన్ లోని సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కృషి చేస్తానని తెలిపారు.

Leave a Reply