Lucky draw | విజయం ఎవరిని వరించిందంటే..

Lucky draw | విజయం ఎవరిని వరించిందంటే..

Lucky draw | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అయితే సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. హోరాహోరీగా వెలువడిన ఫలితాల్లో చివరికి విజేతను అదృష్టం వరించింది. 3వ వార్డులో బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి ఇరుపార్టీల మధ్య ఆధిక్యం దోబూచులాడింది. చివరకు లెక్కింపు పూర్తయ్యేసరికి ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావడంతో అధికారులు అశ్చర్యపోయారు.

అయితే, ఎన్నికల నిబంధనల ప్రకారం.. ఓట్లు సమానంగా వచ్చిన నేపథ్యంలో విజేతను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయాలని నిర్ణయించారు. అనంతరం అధికారులు చిన్న స్లిప్పులపై ఇద్దరు అభ్యర్థుల పేర్లు రాసి ఓ బాక్సులో వేసి డ్రా తీయగా బీఆర్ఎస్ అభ్యర్థి పేరు రావడంతో అధికారులు ఆ అభ్యర్థిని విజేతగా ప్రకటించారు.

అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఎక్కడా చిన్న తప్పు కూడా జరగకూడదన్న ఉద్దేశంతో ఎన్నికల అధికారులు రెండుసార్లు రీ-కౌంటింగ్ నిర్వహించారు. అయితే, రెండోసారి లెక్కించినా ఫలితంలో ఎలాంటి మార్పు రాకపోవడంతో చివరకు లక్కీ డ్రా ద్వారా విజేతను అధికారులు ప్రకటించారు.

Leave a Reply