Budget Allocations – రూ. 50,65,345 కోట్ల‌తో కేంద్ర బ‌డ్జెట్ – ర‌క్ష‌ణ శాఖ‌కు భారీ కేటాయింపులు

ర‌క్ష‌ణ శాఖ‌కు ఏకంగా 4,91,732 కోట్లు కేటాయింపు
గ్రామీణాభివృద్ది రూ. 2,66,817 కోట్లు
హోం రూ. 2,33,211 కోట్లు
వ్యవసాయ, అనుబంధ రంగానికి రూ. 1,71,437 కోట్లు
విద్య రూ. 1,28,650 కోట్లు

కేంద్ర వార్షిక బడ్జెట్‌2025-26ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ. 50,65,345 కోట్లతో 2025-26 ఏడాది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టారు. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ద్రవ్యలోటు 4.4 శాతం ఉందని ప్రకటించారు. రెవెన్యూ రాబడి రూ.34.96 లక్షల కోట్లేనని పేర్కొన్నారు. రూ.11.4 లక్షల కోట్లు అప్పుల రూపంలో సమీకరిస్తామని మిగిలిన ఆదాయం ఇతర మార్గాల్లో సమకూరుతుందని వెల్లడించారు. ఈ బడ్జెట్ రక్షణ శాఖకు అధికంగా నిధులు కేటాయించింది కేంద్రం. ఏఏ రంగాలకు ఎంత మేరకు బడ్జెట్‌లో నిధులు కేటాయించారో ఇప్పుడు చూద్దాం.

వివిధ శాఖలకు కేటాయింపులు ఇవే..
రక్షణ రూ. 4,91,732 కోట్లు
గ్రామీణాభివృద్ది రూ. 2,66,817 కోట్లు
హోం రూ. 2,33,211 కోట్లు
వ్యవసాయ, అనుబంధ రంగానికి రూ. 1,71,437 కోట్లు
విద్య రూ. 1,28,650 కోట్లు
ఆరోగ్య రూ. 98,311 కోట్లు
పట్టణాభివృద్ది రూ. 96,777 కోట్లు
ఐటి, టెలికం రూ. 95,298 కోట్లు
విద్యుత్‌ రూ. 81,174 కోట్లు
వాణిజ్య, పరిశ్రమలు రూ. 65,553 కోట్లు
సామాజిక సంక్షేమం రూ. 60,052కోట్లు
వైజ్ఞానికి విభాగాలకు రూ. 55,679 కోట్లు

కేంద్రానికి వచ్చే ఆదాయం…

ఆదాయపన్ను నుంచి 22 శాతం
కేంద్ర ఎక్సైజ్‌ నుంచి 5 శాతం
జిఎస్టి, ఇతర పన్నుల నుంచి 18 శాతం.
కార్పొరేషన్‌ పన్ను ద్వారా 17 శాతం
కస్టమ్స్‌ ద్వారా… 4 శాతం
అప్పులతో కాని క్యాపిటల్‌ రిసిప్ట్స్‌ ద్వారా 1 శాతం
పన్నేతర ఆదాయం 9 శాతం
అప్పులు, ఇతర మార్గాల ద్వారా 24 శాతం ఆదాయం సమకూరుతుంది.

కేంద్ర ఖర్చులు….

వడ్డీ చెల్లింపులకు 20 శాతం
కేంద్ర ప్రభుత్వ పథకాలకు 16 శాతం
కీలక సబ్సిడీలకు 6 శాతం
రక్షణ రంగానికి 8 శాతం
రాష్ట్రాలకు పన్నులు, డ్యూటీల ద్వారా చెల్లింపుల్లో 22 శాతం
ఫైనాన్స్‌ కమిషన్‌, ఇతర బదిలీల ద్వారా 8 శాతం
కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు 8 శాతం
ఇతర ఖర్చులకు 8 శాతం
పెన్షన్స్‌లకు 4 శాతం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *