Parkal | ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపిన పావుశెట్టి సునీల్

Parkal | పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ప్రజాస్వామ్యంపై నమ్మకంతో పోలింగ్‌లో పాల్గొన్న పరకాల పట్టణ, విలీన సీతారాంపురం, రాజిపేట ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలను కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పావుశెట్టి సునీల్ తెలియజేశారు. ఎన్నికల కాలమంతా అహర్నిశలు శ్రమిస్తూ, ఇంటింటి ప్రచారం నుంచి పోలింగ్ రోజు వరకు పార్టీ పతాకాన్ని గౌరవంగా మోసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా విభాగం, యువజన విభాగం, అనుబంధ సంఘాల శ్రేణులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు అని, మీ అంకితభావం, త్యాగం, పార్టీపై ఉన్న అపార విశ్వాసమే మాకు నిజమైన బలం అని, పరకాల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షానే నిలుస్తుందని మరోసారి స్పష్టం చేశారు. మరొక్కసారి పరకాల ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా మనస్ఫూర్తి ధన్యవాదాలు అని చైర్మన్ అభ్యర్థి సునీల్ తెలియజేశారు.

Leave a Reply