Naspur | సింగరేణిలో జాతీయ సంఘాల నిరసన

Naspur | నస్పూర్, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాల్లోని 4లేబర్ కోడ్ లను తొలగించాలని దేశవ్యాప్త సమ్మెతో కేంద్ర ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని జాతీయ సంఘాలు తలపెట్టిన గురువారం ఒకరోజు సమ్మెలో ఏఐటియుసి, ఐఎన్టియుసి, టిబిజికెఎస్, సిఐటియు, ఐఎఫ్టియు కార్మిక సంఘాలు శ్రీరాంపూర్ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేట్ కార్పొరేట్ సంస్థలకు కారుచౌకగా అమ్మడం జరుగుతుందని,మరోపక్క ఉద్యోగుల,కార్మికుల చట్టబద్దమైన హక్కులను రద్దు చేసి ఎలాంటి ప్రయోజనం లేని 4 లేబర్ కోడ్ లు తీసుకురావడం జరిగిందన్నారు.
సింగరేణి సంస్థను దశల వారీగా ప్రయివేటీకరణ చేసేందుకు పూనుకుంటుందని, వ్యవసాయాన్ని నమ్ముకొని బ్రతుకుతున్న రైతులను నష్టాల పాలు చెయ్యడం కోసం,అమెరికా ట్రంప్ కు భయపడి జీరో సుంకాలతో అమెరికా నుంచి పంటల దిగుమతి చేసుకోవడం జరుగుతుందని విమర్శించారు. దేశాన్ని,కార్మిక చట్టాలను,వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడంకోసం కార్మిక సంఘాల అక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమంలో ఏఐటిసి అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్, మినిమం వేస్బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్, టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సురేందర్ రెడ్డి, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి, ఐఎఫ్టుయు రాష్ట్ర నాయకులు టి. శ్రీనివాస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
