Prabhas | ప్రభాస్ గురించి రాజ్ ముదిరాజ్ నిజాలు..

Prabhas | ప్రభాస్ గురించి రాజ్ ముదిరాజ్ నిజాలు..

Prabhas | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : బాహుబలి మూవీతో ప్రభాస్.. పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ లోనే క్రేజ్ సొంతం చేసుకున్నాడు. జపాన్ అభిమానులు ఎంతలా ప్రభాస్ పై ప్రేమ చూపిస్తారో చూశాం. ప్రభాస్ పై ప్రేమతో ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తుంటారు. డైరెక్టర్ రాజ్ ముదిరాజ్ ప్రభాస్ (Prabhas) గురించి ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇందులో ప్రభాస్ గురించి రాజ్ ముదిరాజ్ నిజాలు చెప్పాడు. తన మనసును ఆవిష్కరించాడు. ఇంతకీ.. అంతలా ఆ వీడియోలో ఏం చెప్పారు..? అసలు ఏం జరిగింది..?

Prabhas | రాజాసాబ్ పై విమర్శలు..

ప్రభాస్.. రాజాసాబ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మారుతి తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. బాక్సాఫీస్ దగ్గర రాజాసాబ్ (Rajasaab) ప్లాప్ అయ్యింది. అయితే.. ఈ సినిమాలో ప్రభాస్ లుక్స్ పై విమర్శలు వచ్చాయి. అలాగే విప‌రీతంగా బాడీ డ‌బుల్స్ వాడ‌డం మీద ట్రోలింగ్ జరిగింది. దీంతో ప్రభాస్ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని సోషల్ మీడియా ద్వారా సలహాలు ఇచ్చారు. అయితే.. ఆయనకు సలహాలు ఇచ్చింది అభిమానులే కాకుండా.. సినిమా ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్ ముదిరాజ్ కూడా ఉండడం విశేషం.

Prabhas

Prabhas | ఎవరీ రాజ్ ముదిరాజ్..

రాజ్ ముదిరాజ్.. రుషి, ఆంధ్రాపోరి అనే సినిమాలు తీసారు. ఆయన నటుడుగా కూడా మారి కొన్ని సినిమాల్లో నటించారు. ఇప్పుడు ప్రభాస్ పై ప్రేమతో ఓ వీడియో రిలీజ్ (Video Release) చేశారు. ప్ర‌భాస్ ఎంత గొప్పవాడో చెబుతూనే ఆయన మార్చుకోవాల్సిన విషయాలను ఒక అభిమానిలా చెప్పే ప్రయత్నం చేశారు. ఇంతకీ రాజ్ ముదిరాజ్ ఏం చెప్పారంటే.. ప్ర‌భాస్ ఇది నీకు నేను రాస్తున్న ప్రేమ‌లేఖ‌. నువ్వొక రారాజు. నీ పేరు విన‌గానే ఒక అంద‌మైన ఆత్మీయుడు, ఒక అరివీర భ‌యంకురుడైన యోధుడు, ఒక చిలిపి ప్రేమికుడు గుర్తుకొస్తాడు. మ‌గ‌వాళ్ల న‌డ‌క‌ను సింహంతో పోలుస్తారు క‌దా. తెలుగులో ఆ మాట‌కొస్తే.. ఇండియాలో నీకు సూటైన‌ట్లు ఇంకెవ్వ‌రికీ సూట్ కాదు.

Prabhas

Prabhas | డార్లింగ్.. అది నీ స్టామినా..

ర‌జినీకాంత్, హృతిక్ రోష‌న్ కొంచెం ద‌గ్గ‌ర‌గా వ‌స్తారేమో. నీ ఛాతీ నంబ‌ర్ ఎంతో కానీ.. నీ పేరు విన‌గానే నా ఛాతీ పెద్ద‌ద‌వుతుంది. నీ ఫ్లాప్ సినిమాలు మూడింటి క‌లెక్ష‌న్ (Collection) క‌లిపితే వెయ్యి కోట్లు. నిజంగా అవి బాగుండి జ‌నాల‌కు న‌చ్చి హిట్ట‌యి ఉంటే ఆకాశ‌మే హ‌ద్దు. నువ్వు క‌దా నిజ‌మైన గ్లోబ‌ల్ స్టార్‌వి. మా అమ్మాయి త‌న కాలేజీలో పోస్ట‌ర్ క్యాంపైన్ పెడితే కోహ్లి, హ్యారీ పోర్ట‌ర్ కంటే కూడా ఎక్కువ పోస్ట‌ర్లు నీవే అమ్ముడ‌య్యాయి. అది నీ స్టామినా, అది నీకున్న ఫాలోయింగ్. డార్లింగ్ నేను నీ స‌గ‌టు ఫ్యాన్ కాదు. నాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. కొన్ని ప్ర‌శ్న‌లు అడుగుతాను.

Prabhas

Prabhas | ఫ్రొఫెషనిలిజం ఏమైంది…?

నువ్వు నీ బాడీ మీద, భాష‌, వాచ‌కం మీద శ్ర‌ద్ధ పెట్టి ఎన్నాళ్ల‌యింది? నీ ఫిగ‌రెందుకు చింద‌ర‌వందర అయింది? నీ గొంతెందుకు ముద్ద‌గా వ‌స్తోంది? నీ క‌ళ్ల కింద న‌ల్ల‌గా క్యారీ బ్యాగులు వ‌చ్చాయి. నీ న‌డ‌క‌లో గ్రేస్ ఏమైంది? నీ క‌ద‌లిక‌ల్లో చురుకుద‌నం ఏమైంది? ఎందుకు నీలో మోటివేష‌న్ త‌గ్గిపోతోంది? కొత్త అభిమానులు తయారు చేసుకోవడానికి నీలో ఉత్సాహం ఎందుకు తగ్గుతుంది.? నీలో ఫ్రొఫెషనిలిజం ఏమైంది…? నీ వయసు 45.. ఇంకా నీకు 15 ఏళ్ల కెరీర్ (Career) ఉంది. నిన్ను ప్రేపించే చిన్నారులు అందరూ కూడా పెరిగి పెద్దయ్యే వరకు నీ సినిమాలు చూస్తూనే ఉంటారు. వాళ్లను వదులకుంటావా..? మిర్చి టైమ్ ఫిగర్ తోటి, ఛత్రపతి టైమ్ లోని వర్చసుతోటి బాహుబలి లాంటి మహానాయకుడు తేజస్సుతోటి.. మళ్ళీ తిరిగి వస్తావమని నమ్ముతున్నాను.. అని చెప్పారు. మరి.. దీని పై ప్రభాస్ రియాక్ట్ అవుతాడేమో చూడాలి.

CLICK HERE TO READ స్పిరిట్ నుంచి బయటపడ్డారా?

CLICK HERE TO READ MORE

Leave a Reply