TG | మందకొడిగా మున్సిపల్ పోలింగ్..!

TG | మందకొడిగా మున్సిపల్ పోలింగ్..!
TG | మంచిర్యాల, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతోంది. బుధవారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ 11 గంటల వరకు 25.61 శాతం మాత్రమే నమోదు కావడం గమనార్హం. ఉదయం 9 గంటల వరకు 11.18 శాతం నమోదైన పోలింగ్ శాతం 2 గంటల్లో 14 శాతం పెరిగింది. మంచిర్యాల కార్పొరేషన్ లో 9.7 శాతం , బెల్లంపల్లి మున్సిపాలిటీలో 12.44, చెన్నూరులో 14.83, క్యాతన్ పల్లిలో 13.92, లక్షెట్టిపేటలో 14.30 శాతం నమోదైన పోలింగ్ క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. ఉదయం 11 గంటల వరకు మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో 21.22 పోలింగ్ శాతం నమోదవగా.. బెల్లంపల్లిలో 30.50, చెన్నూరులో 37.20, క్యాతన్ పల్లిలో 30.86, లక్షెట్టిపేటలో 36.21 నమోదయింది. పోలీసులు ఎప్పటికప్పుడు ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు కృషి చేస్తుండగా క్యాతన్ పల్లిలో బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు, మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సతీసమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
