Health | ఆయనకు ఏమైందంటే…

Health | ఆయనకు ఏమైందంటే…

Health | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలో జిల్లా పరిషత్‌, పంచాయతీ సమితి ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్‌ పవార్‌ ఆరోగ్యంపై ఆందోళన నెలకొంది. బారామతి గోవింద్‌బాగ్‌ నివాసం నుంచి కార్డియాక్‌ అంబులెన్స్‌తో ఆయన్ను పుణేకు తరలించారు.

గత కొన్ని రోజులుగా దగ్గు, కఫం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఉదయం నుంచి వైద్య బృందం పరీక్షలు నిర్వహించగా, సుమారు గంటపాటు పరిశీలించిన అనంతరం పుణేలోని రూబీ హాల్‌ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించాలని వైద్యులు సూచించారు.

Leave a Reply