Sunitha l ఆలేరు 8వ వార్డులో గొంగిడి సునీత ప్రచారం..

Sunitha l ఆలేరు 8వ వార్డులో గొంగిడి సునీత ప్రచారం..

Sunitha l ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 8 వ వార్డులో ఆదివారం సాయంత్రం మాజీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి బిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి పాశికంటి శ్రీనివాస్ తరఫున ఓటర్లను కలుసుకొని ముఖాముఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడిన కష్టాలకు ప్రజలు తగిన తీర్పును ఎన్నికల్లో ఇవ్వాలని ఆమె కోరారు. అనంతరం ఆమె ఐదో వార్డులో పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి మొరిగాడి మాధవి వెంకటేష్ పక్షాన ప్రజలను కలుసుకొని ఆశీర్వదించి గెలిపించాలని సూచించారు.

Leave a Reply