UTF | పేరుకుపోతున్న బకాయిలు వెంటనే చెల్లించాలి

UTF | పేరుకుపోతున్న బకాయిలు వెంటనే చెల్లించాలి
- యూటీఎఫ్ అధ్యక్షుడు మాదాల
UTF | శావల్యాపురం, ఆంధ్రప్రభ : ఉపాధ్యాయులకు పేరుకుపోతున్న బకాయిలు వెంటనే చెల్లించాలని మండల యూటీఎఫ్ అధ్యక్షుడు మాదాల రామకోటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర యుటిఎఫ్ కమిటీ పిలుపుమేరకు ఆర్థిక డిమాండ్ల సాధనకై మండల యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ముఖ్యమంత్రికి ఉత్తరాలు రాసి పంపారు. ఈ సందర్భంగా రాష్ట్ర యుటీఎఫ్ ఆడిట్ కమిటీ సభ్యుడు ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 11వ పిఆర్సి లో జరిగిన ఆర్థికపరమైన నష్టాన్ని కూటమి ప్రభుత్వం సరి చేస్తుందని ఆశించామని ఇంతవరకు ఆ ఊసే లేదన్నారు.
2023 వ సంవత్సరం 7వ నెల నుండి అమలు కావాల్సిన 12 వ పిఆర్సి కమిషన్ చైర్మన్ కూడా ఇంతవరకు నియమించలేదని వాపోయారు. వెంటనే కమిషన్ చైర్మన్ను నియమించి 29 శాతం ఇంటీరియం రిలీఫ్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న 4 డీఏలను విడుదల చేయాలని, కేంద్ర ప్రభుత్వం మెమో 57 ప్రకారం 2004 ముందు నియామకమైన వారికి పాత పెన్షన్ ఇవ్వాలని కోరారు. రామన్న బడ్జెట్ సమావేశాల్లో కేటాయింపులు జరపాలని కోరుతూ ఉత్తరాలు రాస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి గుడ్లూరి ప్రసాద్, గోరంట్ల విజయ కృష్ణ, శివపార్వతి, ఎమ్.బాబురావు, బేగం, కరుణాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.
