కారు గుర్తుకు ఓటేసి అభివృద్ధిని స్వాగతించండి

కారు గుర్తుకు ఓటేసి అభివృద్ధిని స్వాగతించండి
27వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి మంజులత నాగరాజ్ గౌడ్
సంగారెడ్డి ప్రతినిధి, ఫిబ్రవరి 8 (ఆంధ్రప్రభ): బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని 27వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి నక్క మంజులత నాగరాజుగౌడ్ అన్నారు. ఆదివారం వార్డులోని పలు కాలనీల్లో పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ తనను ఆశీర్వదించి గెలిపిస్తే మరోసారి 27వ వార్డును మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. తన ప్రచారానికి వార్డు ప్రజల నుంచి భారీ ఎత్తున స్పందన మద్దతు వస్తుందని తెలిపారు. అందరూ ఆశీర్వదించి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు సాయంత్రం జరిగే వీఆర్ఎస్ కార్నర్ మీటింగ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హరీష్ రావు విచ్చేస్తున్నారని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ కడవెరుగు రాజనర్సు, సీడీసీ మాజీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు మామిళ్ళ రాజేందర్, బీఆర్ఎస్ సీనియర్ నేత నక్క నాగరాజుగౌడ్, దేవులపల్లి వీరేశంగౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
