DHOOM 6  :  జస్ట్​  6 నిముషాల్లో దోపిడీ

DHOOM 6  :  జస్ట్​  6 నిముషాల్లో దోపిడీ

పంజాబ్​ లో కలకలం

₹ 15 లక్షల నగదు.. ఫిస్టల్​ చోరీ

( ఆంధ్రప్రభ, వెబ్​ డెస్క్)​

DHOOM 6 : పంజాబ్​ ఫరీద్​ కోట్​ జిల్లా జైతో ప్రాంతంలోని ఓ అయిల్​ ఫ్యాక్టరీలో జరిగిన భారీ చోరీ.. కలకలం సృష్టించింది. కేవలం 6 నిముషాల (Just 6 Minutes)  వ్యవధిలో దొంగలు తమ పూర్తి చేసుకుని.. కులాసాగా వెళ్లిపోయారు, ఈ ఘటనలో దొంగలకు ₹ 15 లక్షల నగదు, ఒక సర్వీసు రివాల్వరు దక్కాయి. ఇక ఈ దొంగల కోసం పోలీసులు జల్లెడ పడుతుంటే.. ఇది ఇంటి దొంగల పనే.. ఈ విషయాన్నీ పోలీసులు గుర్తించరా? అని పంజాబీలు ప్రశ్నలపై ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.   ఫిబ్రవరి 8, 2026 (ఆదివారం) తెల్లవారుజామున సుమారు 3:20 గంటలకు  ఫరీద్‌కోట్ జిల్లాలోని జైతో ప్రాంతంలోని  ఒక ఆయిల్ ఫ్యాక్టరీలోకి   గుర్తుతెలియని దొంగలు చొరబడి కేవలం 6 నిమిషాల వ్యవధిలోని (Robbery)  ముగించారు.  

DHOOM 6: సుమారు ₹ 15.5 లక్షల నగదు,  ఒక లైసెన్స్   పిస్టల్ ను తీసుకువెళ్లారు.  దోపిడీ  నేర దృశ్యాలు దొరకకుండా ఫ్యాక్టరీలోని CCTV రికార్డింగ్ సిస్టమ్ (DVR) ను కూడా   తీసుకెళ్లారు.  ఈ  దొంగలు అత్యంత వేగంగా, కేవలం 6 నిమిషాల్లోనే (DHOOM 6)  పని పూర్తి చేయడాన్ని బట్టి ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఫ్యాక్టరీలోని నగదు ,  పిస్టల్ ఎక్కడ ఉన్నాయనే విషయం దొంగలకు ముందే తెలిసి ఉండవచ్చని, కాబట్టి ఇందులో ఫ్యాక్టరీ  లోపలి వ్యక్తుల ప్రమేయం (Inside involvement) ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పంజాబ్ పోలీసులు రాత్రిపూట గస్తీ నిర్వహిస్తున్నప్పటికీ, ఈ స్థాయిలో దోపిడీ జరగడం భద్రతా పరమైన ప్రశ్నలను లేవనెత్తింది.