school l వార్షికోత్సవ వేడుకలు

school l వార్షికోత్సవ వేడుకలు

ఇప్పుడు గొప్ప స్థానాల్లో ఉన్న వారు ఎందరో ఒక్కప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారే.
విద్యార్థులకు పట్టుదల, క్రమశిక్షణ అవశ్యం.
కొండపల్లి బాలికోన్నత పాఠశాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ.
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు

school l ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభః ప్రతి ఒక్క విద్యార్థిని పట్టుదల,క్రమశిక్షణతో చదువుకోవాలని, పబ్లిక్ పరీక్షలకు సమయం ఎంతో లేదు కావున పట్టుదల, ఏకాగ్రత, ప్రణాళికాబద్ధంగా చదివి అత్యుత్తమ ఫలితాలు సాధించాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. కొండపల్లిలోని జిల్లాపరిషత్ బాలికోన్నత పాఠశాలలో 36వ వార్షికోత్సవ వేడుకలలో జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ తో కలసి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జాతీయ గేయాన్ని ఆలపించారు. పాఠశాల మైదానంలో విద్యార్థినుల ప్రత్యేక పేరేడ్ కార్యక్రమం తిలకించారు. పాఠశాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ స్వంత నిధులు వెచ్చిస్తున్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు కి కృతజ్ఞతలు తెలుపుతూ విద్యార్థినులు ప్లే కార్డులు ప్రదర్శించారు.

కొండపల్లి బాలికల జెడ్పి హైస్కూలుకు అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు పేర్కొన్నారు. డైనింగ్ హాల్, కిచెన్ నిర్మాణానికి ఏపిహెచ్ఎంఈఎల్ నుంచి సి.ఎస్.ఆర్ నిధులు రూ.25 లక్షలు కేటాయించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం పెయింటింగ్ వర్క్స్ తుదిదశకు చేరుకున్నాయన్నారు. మైదానం చదును చేయడం, సివిల్ వర్క్స్ పనులు కూడా జరుగుతున్నాయన్నారు. విద్యార్థినులలో ఆరోగ్యకరమైన పోటీతత్వం పెంచాలన్నారు. ఇప్పుడు గొప్ప స్థానాల్లో ఉన్నవారంతా ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నారని అన్నారు. కలెక్టర్ లక్ష్మీశ , తను కూడా గవర్నమెంట్ స్కూళ్లలోనే చదువుకున్నట్లు పేర్కొన్నారు.

వచ్చే విద్యా సంవత్సరంలో నియోజకవర్గంలో అత్యంత ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ఇచ్చే కార్యక్రమం ఇక్కడే నిర్వహిస్తామని, ఈ పాఠశాల నుంచి కూడా ఎక్కువమంది విద్యార్థినులు బాగా ప్రతిభ కనబర్చి ఇందులో భాగస్వామ్యం కావాలని అన్నారు. విద్యతో పాటు సంస్కారం, నైతికత ముఖ్యమన్నారు. ఆ దిశగా విద్యాబోధన జరగాలన్నారు. ఉపాధ్యాయులు మరింత బాధ్యత వహించాలన్నారు. మంచిగా చదివి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని పిల్లలకు సూచించారు. విద్యార్థినుల తల్లిదండ్రులు కూడా వారి పిల్లల చదువు గురించి బాధ్యత వహించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందించడానికి మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు.

Leave a Reply