TG | భార్యను గొడ్డలితో నరికి..

TG | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : భార్యను అత్యంత కిరాతకంగా గొడ్డలితో భర్త నరికిచంపిన దారుణ ఘటన తెలంగాణలోని జగిత్యాలలో చోటుచేసుకుంది. జిల్లాలోని లక్ష్మీపూర్ లో భార్య సత్తవ్వను భర్త దారుణంగా హత్య చేశాడు. కుటుంబ కలహాలే కారణంగా కొవొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు మల్లయ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు.
