ప్రైవేటు బస్సు ఆహుతి

ప్రైవేటు బస్సు ఆహుతి

కీసరలో  తప్పిన ఘోర ప్రమాదం

39 మంది ప్రయాణికులు సురక్షితం

( ఆంధ్రప్రభ కంచికచర్ల)

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర (పేరలపాడు ఎన్ఎస్పీ కాలువ సమీపంలో) వద్ద హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న ప్రవేట్ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు శుక్రవారం అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుంది. డ్రైవర్ అప్రమత్తతతో 39 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

బస్సు ఇంజిన్ భాగం నుంచి పొగలు రావడంతో వెంటనే బస్సును రోడ్డుపక్కకు నిలిపి ప్రయాణికులను కిందికి దించారు. కొద్దిసేపటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న నేషనల్ హైవే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సు పూర్తిగా కాలిపోవడంతో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Leave a Reply