ఆలేరు ఏడవ వార్డులో

బీజని బాలమణి ప్రచారం

ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని ఏడవ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బీజని బాలమణి భాస్కర్ శుక్రవారం ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలను, ఓటర్లను కలుసుకొని తనని ఆశీర్వదించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే అంకితభావంతో సేవలు చేసి వార్డును అభివృద్ధి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎంఏ ఎజాస్, నాయకులు కే సాగర్ రెడ్డి, ఎండి జైయినుద్దీన్, కూళ్ల నరసింహులు, వల్లెపు ఉప్పలయ్య, ముదిగొండ శ్రీకాంత్, పోరల్ల సతీష్, దూడల రాజశేఖర్ గౌడ్, తాళ్లపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply