600CrBudget | బన్నీకి షాక్ …? నెగిటివ్ షేడ్ లో రష్మిక సంచలన పాత్ర?

600CrBudget | బన్నీకి షాక్ …? నెగిటివ్ షేడ్ లో రష్మిక సంచలన పాత్ర?

600CrBudget | సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించనున్న అట్లీ
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న బన్నీ మూవీ
నెగిటివ్ షేడ్ లో రష్మిక పాత్రపై హాట్ టాక్
పుష్పరాజ్‌కు ఢీ కొట్టే శ్రీవల్లి?
మేకర్స్ నుంచి ఇంకా క్లారిటీ రానుందా?

600CrBudget | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : నేషనల్ క్రష్ రష్మిక.. ఏ పాత్ర చేసినా.. ఆ పాత్రలో లీనమై నటించడం.. ఆ పాత్రకే వన్నె తేవడం తెలిసిందే. ఇంకా చెప్పాలంటే.. ఆమె పోషించిన పాత్రలో అంతకంటే బాగా ఇంకెవరూ నటించరేమో అనేట్టుగా నటిస్తుంటుంది. అందుకనే.. ఆమె నటించిన పాత్రలు జనాలకు అంతలా నచ్చుతున్నాయి. అయితే.. ఇప్పుడు రష్మిక.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీలో నటిస్తుందని.. ఆమె షాకింగ్ క్యారెక్టర్ చేస్తుందని.. వార్తలు వస్తున్నాయి. ఇంతకీ.. ఆమె ఏ పాత్ర పోషిస్తుంది..? అసలు రష్మిక నిజంగానే ఈ మూవీలో నటిస్తుందా..?

600CrBudget | సరికొత్త ప్రపంచం..


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. కోలీవుడ్ స్టార్ అట్లీ డైరెక్షన్ లో రూపొందుతోన్న మూవీ తరహా కథ ఇప్పటి వరకు తెర పై రాలేదని.. చాలా కొత్తగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అయితే.. ఇందులో అట్లీ.. ఓ కొత్త తరహా ప్రపంచాన్ని ఆవిష్కరించబోతున్నాడని.. ఆడియన్స్ కి థ్రిల్ కలిగించేలా ఇది ఉంటుందని.. మూవీ టీమ్ చెబుతున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్న ఈ సినిమాని కోలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ సన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు అరవై శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని సమాచారం.

600CrBudget | నెగిటివ్ షేడ్ లో రష్మిక..


ఇక అసలు విషయానికి వస్తే.. ఈ సినిమాలో కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకునే నటిస్తుందని ప్రకటించారు. ఆతర్వాత మరే కథానాయిక గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. అయితే.. రష్మిక, మృణాల్ ఠాగూర్, జాన్వీ కపూర్ నటిస్తున్నట్టుగా ప్రచారం అయితే జరిగింది. మృణాల్ ఈ సినిమాలో నటించడం లేదని ఇటీవల క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు రష్మిక గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అయ్యింది. మేటర్ ఏంటంటే.. ఈ సినిమాలో రష్మిక నటిస్తుందని.. ఆమె నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించబోతుందని వార్తలు వస్తున్నాయి.

600CrBudget
600CrBudget
600CrBudget | పుష్పరాజ్ ని ఢీకొట్టే శ్రీవల్లి..


ఇప్పటి వరకు రష్మిక చాలా సాఫ్ట్ క్యారెక్టర్స్ చేసింది. ది గర్ల్ ఫ్రెండ్ మూవీలో స్ట్రాంగ్ గా ఉండే క్యారెక్టర్ లో కనిపించింది. మైసాలో మాస్ గా పవర్ గా ఉన్న పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు బన్నీని ఢీ కొట్టే పవర్ ఫుల్ విలన్ క్యారెక్టర్ లో నటిస్తుందనే వార్త ఆసక్తిగా మారింది. పుష్ప, పుష్ప 2 సినిమాలో బన్నీ, రష్మిక ఎలా నటించారో చూశాం. ఇప్పుడు ఢీ కొట్టే క్యారెక్టర్స్ చేయడం అనేది ఆడియన్స్ లో మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ముంబై షెడ్యూల్‌లో భాగంగా రష్మిక ప్రస్తుతం తన సోలో సీన్ల షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. అయితే.. మేకర్స్ మాత్రం ఎలాంటి అనౌన్స్ మెంట్ ఇవ్వలేదు. ఇదే కనుక నిజమైతే.. బన్నీతో ఢీ కొట్టే క్యారెక్టర్ లో విలన్ గా రష్మిక నటిస్తే.. ఈ మూవీ పై మరింత ఆసక్తి కలగడం ఖాయం. మరి.. త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి. షాకింగ్ నెగిటివ్ పాత్రలో రష్మిక కనిపిస్తే అది నిజంగా సంచలనం అవుతుంది.