2వ వార్డు అభివృద్ధి కోసం కాంగ్రెస్ అభ్యర్ధి నాగరాజు మిస్కిన్ ను గెలిపించండి

2వ వార్డు అభివృద్ధి కోసం కాంగ్రెస్ అభ్యర్ధి నాగరాజు మిస్కిన్ ను గెలిపించండి

ఎన్నికల ప్రచారంలో మాజీ ఎంపిపి చంద్రకాంత్ గౌడ్

ఓటరు మద్దతు కోరుతున్న 2వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి నాగరాజు మిస్కిన్ ,మాజీ ఎంపిపి చంద్రకాంత్ గౌడ్

మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో 2వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాగరాజు మిస్కిన్ ను ఆశీర్వదించి అండగా నిలిచి భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎంపిపి చంద్రకాంత్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా వార్డు పరిధిలో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. ఇంటింటికి వెళ్లి నాగరాజు మిస్కిన్ ను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసిందన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని దండు గ్రామం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమన్నారు. అభివృద్ధి కోసం ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నాగరాజు ముస్లిం ను భారీ మెజారిటీతో గెలిపించడం ద్వారా మంత్రి వాకిటి శ్రీహరికి కానుకగా ఇవ్వాలని కోరారు. గ్రామంలో అంతర్గత రోడ్ల నిర్మాణం డ్రైనేజీ నిర్మాణం మంచినీటి సమస్య పరిష్కారానికి పూర్తి బాధ్యత తీసుకుంటామన్నారు. గ్రామంలో నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తామని చెప్పారు. అభివృద్ధి సంక్షేమం కోసం ఈనెల 11న జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాగరాజు మిస్కిన్ హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో రెండవ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి నాగరాజు మిస్కిన్ తో పాటు నాయకులు వెంకట్ రెడ్డి, ఆనంద్, శేఖర్ ,మద్దూరు వెంకటేష్, పల్లెర్ల కురుమయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply