మరోసారి కాంగ్రెస్ ను గెలిపించండి

మరోసారి కాంగ్రెస్ ను గెలిపించండి

  • కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్ గౌడ్ జోరుగా ప్రచారం

వనపర్తి ప్రతినిధి, ఆంధ్రప్రభ : వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని పదో వార్డులో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలనే తపన, ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలనే లక్ష్యంతో వస్తున్న తనను ఆదరించి హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని 10వ వార్డు కాంగ్రెస్అభ్యర్థి మధుసూదన్ గౌడ్ కోరారు. గురువారం 10వ వార్డు లో ఆయన తన అనుచరులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గతంలో తన భార్య జయసుధ ను కౌన్సిలర్ గా గెలిపించడంతో ఎమ్మెల్యే మెఘారెడ్డి ఆధ్వర్యంలో వార్డులో సుమారు మూడు కోట్ల రూపాయలతో రోడ్లు డ్రైనేజీలు తదితర అనేక అభివృద్ధి పనులు చేసి చూపెట్టడం జరిగిందని తెలిపారు.

మరో కోటి రూపాయలతో అభివృద్ధి చేసేందుకు మంజూరు కూడా చేయించుకోవడం జరిగిందని చెప్పారు. ఎస్సీ కమ్యూనిటీ భవనం మహిళా సంఘ భవనాలను సాధించుకోవడం జరిగిందని తెలిపారు. కౌన్సిలర్ గా పోటీ చేసే అవకాశం కల్పించడం ద్వారా వార్డును అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చినందున పదో వార్డు ప్రజలు విజ్ఞతతో ఆలోచించి విజయం అందించాలని అభ్యర్థి మధుసూదన్ గౌడ్ కోరారు. వార్డు సమస్యలు తన సమస్యలు గా ప్రజల కష్టాలు నా కష్టంగా భావించి పరిష్కారం చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

కాలనీ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి సేవ చేస్తానని తెలిపారు. వార్డు లో విద్యుత్ సమస్య, మిగిలిపోయిన మురికి కాలువల నిర్మాణం, సీసీ రోడ్స్, వీధి దీపాల ఏర్పాటు తదితర సమస్యలు సాల్వ్ చేస్తానని హామీ ఇచ్చారు. చనిపోయిన వ్యక్తి బంధువులు దినాల సమయంలో రోడ్లపై స్థానాలు చేసే పరిస్థితిని అధిగమించేందుకు గన్నోళ్ల భావి దగ్గర నాలుగు గంటల భూమిని కూడా కేటాయించుకోవడం జరిగిందని ఇందుకు సొంత నిధులతో గతంలోనే ప్రహరీ గోడను నిర్మాణం చేసినట్లు తెలిపారు.ఈ సందర్బంగా వార్డు లో ఇంటింటికి తిరుగుతూ జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలను అనూహ్య స్పందన వ్యక్తం అయింది.

Leave a Reply