march26th | ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ ఫిక్స్..

march26th | పవర్ స్టార్ ఉస్తాద్ భగత్ సింగ్….. బాక్సాఫీస్ షేక్ ఖాయమా..
march26th | ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్‌పై క్లారిటీ
పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ క్రేజీ కాంబో
షూటింగ్ పూర్తి.. పోస్ట్ ప్రొడక్షన్ జోరు
ఫస్ట్ సింగిల్‌తో వింటేజ్ పవర్ స్టార్
అభిమానులకు మార్చి 26 పండగే
march26th | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. దీనికి హరీష్ శంకర్ డైరెక్టర్. గబ్బర్ సింగ్ కాంబోలో రూపొందుతోన్న మూవీ కావడం.. ఓజీ బ్లాక్ కావడంతో.. ఈ మూవీ పై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. అయితే.. గత కొన్ని రోజులుగా రిలీజ్ ఎప్పుడు అనేది సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది క్లారిటీ వచ్చేసింది. అఫిషియల్ గా ఉస్తాద్ వచ్చేది ఎప్పుడో అనౌన్స్ చేశారు. ఇంతకీ.. ఉస్తాద్ వచ్చేది ఎప్పుడు..? ఈసారి కూడా బాక్సాఫీస్ ని షేక్ చేసేనా..?

ప్రత్యేక విందుగా..
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం కోసం తెలుగు సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని 2026లో మార్చి 26న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ప్రత్యేక విందుగా నిలవడంతో పాటు, అన్ని వయసుల ప్రేక్షకులను అలరించేలా వినోదభరితంగా ఈ చిత్రాన్ని మలుస్తున్నారు.
పవర్ ప్యాక్డ్ ఎంటర్ టైన్మెంట్..
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ దేఖ్లేంగే సాలాలో పవన్ కళ్యాణ్ కనిపించిన తీరు కట్టిపడేసింది. లుక్, ఎనర్జీ, స్టెప్పులు పరంగా వింటేజ్ పవర్‌స్టార్ ను ఆవిష్కరించింది ఈ పాట. అభిమాని నుంచి దర్శకుడిగా మారిన హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ తో రూపొందించిన గత చిత్రం గబ్బర్ సింగ్ తో ఎంతటి సంచలనాలు సృష్టించారో తెలిసిందే. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ తో అంతకుమించిన సంచలనాలు సృష్టించడానికి సిద్ధమవుతున్నారు. కుటుంబాలతో కలిసి ప్రేక్షకులు థియేటర్లకు తరలి వెళ్లి, పవర్‌ప్యాక్డ్ వినోదాన్ని ఆస్వాదించేలా ఉస్తాద్ భగత్ సింగ్ రూపుదిద్దుకుంటోంది.
అభిమానులకు పండగే..
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే.. ఆ సందడే వేరు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. మార్చి 26న అసలుసిసలైన పవర్‌స్టార్ వేడుకకు సిద్ధంగా ఉండండి అంటున్నారు మేకర్స్. త్వరలోనే ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీకి ఉన్న క్రేజ్ చూస్తుంటే.. ఈసారి కూడా పవర్ స్టార్ బాక్సాఫీస్ ని షేక్ చేయడం ఖాయం అనిపిస్తుంది. మరి.. ఉస్తాద్ ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తాడో.. ఎలాంటి రికార్డులు సెట్ చేస్తాడో చూడాలి.
