కౌంటర్.. కౌంటర్ అటాక్

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మంది ఫోన్లు వినే మీలాంటి వాళ్లు జతిపితలు ఎలా అవుతారని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చేసిన తప్పులకు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని రేవంత్ మండిపడ్డారు. నోటీసులు ఇస్తే జాతిపితకు నోటీసులిస్తారా అంటున్నారు, ఎవరికి నువ్వు జాతిపితవు అని విమర్శించారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన జయశంకర్ తెలంగాణ జాతిపిత, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ దేవత అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పోలీసులు మంచోళ్లు కాబట్టి మీకు ముసుగులేయకుండా తీసుకొచ్చారన్నారు.

కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత రేవంత్ కి లేదని మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. జాతిపిత అంటే రేవంత్ కు తెలుసా? తెలంగాణ కోసం కేసీఆర్ పదవులు త్యాగం చేశారని తెలిపారు. ప్రాణం పణంగా పెట్టిన కేసీఆర్ తెలంగాణ సాధించారు. తెలంగాణ కోసం రేవంత్ రెడ్డి ఎప్పుడైనా ఉద్యమం చేశారా అని ప్రశ్నించారు. ఉద్యమకారులపై తుపాకీ పెట్టిన చరిత్ర రేవంత్ ది. కాంగ్రెస్ నేతలను తొక్కుకుంటూ రేవంత్ ఎదిగారు. కేసీఆర్ తెలంగాణ సాధించాకుంటే రేవంత్ సీఎం అయ్యేవారా అని హరీష్ రావు ప్రశ్నించారు

Leave a Reply