TG | మహిళా పాఠశాల, జూనియర్ కళాశాలలో ఫుడ్ పాయిజన్…

TG | మహిళా పాఠశాల, జూనియర్ కళాశాలలో ఫుడ్ పాయిజన్…

TG | జక్రాన్ పల్లి, ఆంధ్రప్రభ : మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, జూనియర్ కళాశాల, జక్రాన్ పల్లిలో కలుషిత ఆహారం తిని జూనియర్ మొదటి సంవత్సరము ఒకేషనల్ నర్సింగ్ విభాగానికి చెందిన 8 మంది విద్యార్థినీలు ఆసుపత్రి పాలయ్యారు. ఉదయం అల్పాహారం తీసుకున్న విద్యార్థినీలు అస్వస్థకు గురికాగా, వెంటనే వారిని ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పాఠశాల సిబ్బంది విద్యార్థినీలను చేర్పించారు. ప్రస్తుతము వారి పరిస్థితి మెరుగుపడిందని, ఒక విద్యార్థిని మెరుగైన వైద్య చికిత్స కొరకు నిజామాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని అధికారులు తెలిపారు.

Leave a Reply