SEMI FINAL | భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్

SEMI FINAL | భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్
- ఐసీసీ అండర్19 వరల్డ్ కప్ సెమీ ఫైనల్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్
SEMI FINAL | వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : ఐసీసీ అండర్ 19 వన్డే వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ చివరి అంకానికి చేరుకుంది. గత నెలలో ప్రారంభమైన ఈ మెగా టోర్నమెంట్ మరో రెండు రోజుల్లో ముగియనుంది. మొదటి సెమీ ఫైనల్ లో అద్భుతంగా రాణించిన ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్ కు దూసుకు వెళ్ళింది. ఇవాళ రెండో సెమీ ఫైనల్ లో భాగంగా ఇండియా అండర్ 19 వర్సెస్ ఆఫ్గనిస్తాన్ అండర్ 19 జట్ల మధ్య ఫైట్ జరుగుతుంది.

హరారే వేదికగా భారత్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య రెండో సెమీ ఫైనల్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ మహబూబ్ ఖాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఈ మ్యాచ్ కోసం భారత్ ఎలాంటి మార్పులు చేయలేదు. గత మ్యాచ్‌లో పాక్‌తో ఆడిన జట్టునే కొనసాగించారు. నిన్న జరిగిన తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్ డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాపై విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఈ పోరులో విజయం సాధించిన జట్టు ఫిబ్రవరి 6 శుక్రవారం ఫైనల్ పోరులో ఇంగ్లాండ్‌తో తలపడాల్సి ఉంటుంది. టీమిండియాకు ఆయుష్ మాత్రే, అఫ్గానిస్థాన్‌కు మహబూబ్ ఖాన్ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు.

భారత్ : ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మ్హత్రే(సి), వేదాంత్ త్రివేది, విహాన్ మల్హోత్రా, అభిజ్ఞాన్ కుందు(w), RS అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, దీపేష్ దేవేంద్రన్
ఆఫ్ఘనిస్తాన్ : ఉస్మాన్ సదాత్, ఖలీద్ అహ్మద్జారు, ఫైసల్ షినోజాదా, ఉజైరుల్లా నియాజై, మహబూబ్ ఖాన్(w/c), అజీజుల్లా మియాఖిల్, అబ్దుల్ అజీజ్, ఖతీర్ స్టానిక్జారు, రూహుల్లా అరబ్, నూరిస్తానీ ఒమర్జాయ్, వహిదుల్లా జద్రాన్
