Aler | ప్రచారంలో అతనొక్కడే…

Aler | ప్రచారంలో అతనొక్కడే…
Aler | ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ 11వ వార్డు అభ్యర్థిగా బీఎస్పీ పార్టీ నుండి ఎలుగల శ్రీనివాస్ పోటీలో ఉన్నారు. మొత్తం మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా కేవలం 11వ వార్డు నుండి మాత్రమే అభ్యర్థిగా శ్రీనివాస్ ను బీఎస్పీ పోటీలో నిలిపింది. తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన శ్రీనివాస్ ఇంటింటికి తిరిగి ఓటర్లను కలుసుకుంటూ 8 ప్రధాన హామీలతో తానే ఒక్కడై, అన్నీ తానై ఏక సైనికుడిలా ప్రచారం చేసుకుంటూ ప్రధాన పార్టీలకు ధీటుగా ప్రచార పర్వంలో సాగుతున్నారు. 11వ వార్డు ప్రచారంలో శ్రీనివాస్ ఒక ప్రచార ఆకర్షణగా మారారు.
