22nd Ward | సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..

22nd Ward | పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలోని 22 వ వార్డులోని ఓటర్లు ఆదరిస్తే వార్డు సమస్యలు పరిష్కరించి వార్డు అభివృద్ధి చేస్తానని బీజేపీ 22వ వార్డు అభ్యర్థి కొలనుపాక భద్రయ్య వార్డులోని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం 22వ వార్డు బీజేపీ పార్టీ అభ్యర్థి కొలనుపాక భద్రయ్య ఇంటింటి ప్రచారంలో భాగంగా గెలుపే లక్ష్యంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రచారం నిర్వహించారు. 22వ వార్డులో ఓటర్లు బిజెపి పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి, బీజేవైఎం నాయకులు కొలనుపాక అనిల్, కొలనుపాక సిద్దు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply