BRS | అభివృద్ధి కాంక్షించి గెలిపించండి..

BRS | అభివృద్ధి కాంక్షించి గెలిపించండి..

BRS, మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీ లో 1 వ వార్డులో యువనేత, విద్యావంతుడు, బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి చోల్లేటి నరేశ్ ప్రచారంలో దూసుకెళుతున్నాడు. అభివృద్ధి కాంక్షించి తమ కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్ధిస్తున్నాడు. తనకు ఒక్కసారి అవకాశం ఇచ్చి కౌన్సిలర్ గా గెలిపిస్తే.. అవినీతికి తావులేకుండా నిత్యం ప్రజల మద్య ఉంటూ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు.

1 వ వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి లైట్లు, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని ప్రచారం నిర్వహిస్తున్నారు. నిత్యం స్థానికంగా, ఓటర్లకు అందుబాటులో ఉండే తనకు ఈ సారి అవకాశం ఇచ్చి వార్డ్ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply