Election | గులాబి కౌన్సిలర్లను గెలిపించండి …

Election | గులాబి కౌన్సిలర్లను గెలిపించండి …

  • జనగామ మున్సిపల్ లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి …

Election | జనగామ, ఆంధ్రప్రభ : జనగామ మున్సిపల్ ఎన్నికల లో భాగంగా సోమవారం పట్టణ కేంద్రంలోని 1,2,3,4,14,15 వార్డులలోను పార్టీ అభ్యర్థులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డుల్లోకి వచ్చిన ఎమ్మెల్యే పల్లా కు స్థానిక ప్రజలు, తిలకం దిద్దుతూ, మంగళ హారతులు ఇస్తూ, డప్పు వాయిద్యాల మధ్యన, పూల వర్షం కురిపిస్తూ ఘనంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ గులాబి అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. కెసిఆర్ ప్రభుత్వంలోనే జనగామ ప్రాంతం అభివృద్ధి చెందిందని, జిల్లా కలెక్టరేట్ భవనం, మెడికల్ కాలేజీ, ప్రభుత్వ ఆసుపత్రిల ఏర్పాటులతో ఎంతో అభివృద్ధి చెందిందని, తమ నీలిమ ఆస్పత్రిలో ఎంతోమంది పేదలకు ఉచిత వైద్యం అందజేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పథకం అమలులో చిత్తశుద్ధి కరువైందన్నారు. జనగామ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపే మోగ్గు చూపారన్నారు. ఈ కార్యక్రమంలో పలు వార్డులలోని కౌన్సిలర్లు, క్లస్టర్ ఇంచార్జిలు, వార్డు ఇన్చార్జిలు పలువురు పాల్గొన్నారు..