votes | టీబీజీకేఎస్ బలపరిచిన బీఆర్ఎస్ అభ్యర్థి ఇంటింటి ప్రచారం

votes | టీబీజీకేఎస్ బలపరిచిన బీఆర్ఎస్ అభ్యర్థి ఇంటింటి ప్రచారం

votes | భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ : టీబీజీకేఎస్ బీఆర్ఎస్ బలపరిచిన 28వ వార్డు అభ్యర్థి భోగం నరేందర్ గారిని కారు గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరుతూ మిలీనియం క్వార్టర్స్‌లోని 28వ వార్డులో బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుపై ఓట్లు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.

ఈ ప్రచారానికి వార్డు ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. ఈ సందర్భంగా క్వార్టర్స్ ప్రజలు తమకు ఎదురవుతున్న పలు సమస్యలను అభ్యర్థి దృష్టికి తీసుకురాగా, ఎన్నికల్లో గెలిచిన వెంటనే అన్ని సమస్యలను పరిష్కరిస్తానని భోగం నరేందర్ హామీ ఇచ్చారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ఈ ప్రచార కార్యక్రమంలో టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ బడికల సమ్మయ్య, కేంద్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవరకొండ మధు, వార్డు అధ్యక్షుడు సాంబయ్య, టీబీజీకే శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply