RI caught | లంచంతో ఏసీబీకి చిక్కిన ఆర్ఐ

RI caught | లంచంతో ఏసీబీకి చిక్కిన ఆర్ఐ

  • రూ.20వేలు తీసుకుంటూ…

RI caught | వెబ్ డెస్క్, ఆంధ్ర‌ప్ర‌భ : లంచం తీసుకుంటూ ఆర్ఐ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. గుర్రంపోడు ఆర్ఐ మహమ్మద్ హకీం రూ.20వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. భూమి వివరాలు ఆన్ లైన్ లో అప్ డేట్ చేసేందుకు ఆర్ఐ లంచం అడిగారు. సరిగ్గా లంచం సొమ్ము తీసుకునే సమయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు.

నల్గొండ జిల్లా గుర్రంపోడు తాసిల్దార్ కార్యాలయం పై సోమవారం ఏ సీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఊట్లపల్లి గ్రామానికి చెందిన షేక్ గోరెమియా అనే రైతుకు చెందిన భూమి వేరే వ్యక్తికి పట్టాయింది. తిరిగి తన భూమిని తన పేరిట చేయాలని భూమి పట్టా మార్పిడి విషయంలో ఆర్ ఐ హకీం వద్దకు మూడేళ్లుగా తిరుగుతున్నాడు. దీంతో ఆర్ఐ హకీం రూ. 20 వేలు ఇస్తే పట్టా మార్పిడి చేస్తానని రైతుకు చెప్పడంతో విసిగి వేసారిన రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో సోమవారం మధ్యాహ్నం రైతు గోరెమియా గుర్రంపూడ్ తాసిల్దార్ కార్యాలయంలో ఆర్ ఐ హాకీమ్ కు నగదదును ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆ తర్వాత ఏసీబీ అధికారులు కార్యాలయం తలుపులను మూసి అక్కడ పనిచేస్తున్న అధికారులందరినీ విచారించారు. ఏసిబీ దాడి విషయంతో ప్రభుత్వ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

Leave a Reply